

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు గవర్నర్‌ను కలిశామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలు, రైతులు, నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులపై జరిగిన ఘటనలను కూడా వివరించినట్లు పేర్కొన్నారు.
అసెంబ్లీకి తమను అనుమతించకపోవడం, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనలు, పోలీసుల వ్యవహారశైలిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నివాసంపై జరిగిన ఘటన, బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్, శాసనసభ వ్యవహారాల్లో రాజ్యాంగ నిబంధనలు, కోర్టుల ఆదేశాలను ప్రభుత్వం గౌరవించడం లేదనే అంశాలను గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. అసెంబ్లీతో పాటు బయట జరిగిన పరిణామాలపై విచారణ జరిపిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని, తెలంగాణలో న్యాయం జరగకపోతే జాతీయ మహిళా కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!