9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

Writer: Chandrika 02:28 PM, 9 సెప్టెంబర్, 2026
టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

తమిళనాడు సీఎం విజయ్‌ కుమారుడు జాసన్‌ సంజయ్‌ ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్‌ పాల్గొని సినిమా గురించి మాట్లాడారు. సేలం నుంచి ‘సిగ్మా’ ప్రమోషన్స్‌ ప్రారంభించడం ఆనందంగా ఉందని, అక్కడ షూటింగ్‌ చేసిన రోజులు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించాయని తెలిపారు. చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం తన కుటుంబం గురించి ప్రస్తావించగానే అభిమానులు ఒక్కసారిగా టీవీకే నినాదాలతో హోరెత్తించారు.

అభిమానుల నినాదాలకు సంజయ్‌ చిరునవ్వుతో థంబ్స్‌అప్‌ సింబల్‌ చూపించడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల కొన్ని బహిరంగ కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడంతో కుటుంబంలో విభేదాలున్నాయంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ స్పందన ఆసక్తిని రేకెత్తించింది. ‘సిగ్మా’ గురించి సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ‘సిగ్మా మూమెంట్‌’ ఉంటుందని అన్నారు. కొన్ని నిర్ణయాల వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా ఎదగాలనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కిందని, సాధారణ వ్యక్తి కథగా రూపొందిన ‘సిగ్మా’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడిగా మారాలన్న తన ఆలోచనను ముందుగా తల్లితో పంచుకున్నానని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

ట్యాగ్లు
జాసన్‌ సంజయ్‌సిగ్మావిజయ్‌టీవీకేతమిళ సినిమాకోలీవుడ్‌సిగ్మా సినిమాజాసన్‌ సంజయ్‌ దర్శకుడువిజయ్‌ అభిమానులుతమిళనాడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?
షోస్

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు
జనరల్

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...
జనరల్

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌
రాజకీయాలు

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...
రాజకీయాలు

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ
జనరల్

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
జనరల్

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు
జనరల్

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!