

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహిత సిబ్బందికి భారీ విలువైన బహుమతులు ఇచ్చినట్లు పరిపాలన విభాగం వెల్లడించిన ఖర్చుల లెక్కల్లో పేర్కొంది. శ్వేతసౌధంలో తనకు సహకరిస్తున్న నలుగురు సిబ్బందికి మొత్తం 1.55 లక్షల డాలర్ల విలువైన గిఫ్ట్‌లు అందించినట్లు సమాచారం. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ నటాలీ హార్ప్, కమ్యూనికేషన్స్ అడ్వైజర్ మార్గో మార్టిన్, ఓవల్ ఆఫీస్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఛాంబర్‌లైన్ హారిస్‌కు ఒక్కొక్కరికి 45 వేల డాలర్ల విలువైన బహుమతులు ఇచ్చినట్లు లెక్కల్లో వెల్లడైంది.
ఓవల్ ఆఫీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ వాల్ట్ నౌటాకు 20 వేల డాలర్ల విలువైన గిఫ్ట్‌ను అందించినట్లు పేర్కొన్నారు. ఈ బహుమతులు వారి ప్రభుత్వ విధులకు సంబంధించినవి కావని, నైతిక నిబంధనల ప్రకారం అవి అనుమతించదగినవేనని వైట్‌హౌస్ అధికారిక వర్గాలు తెలిపాయి. ట్రంప్ ప్రైవేట్ రంగంలో ఉన్న సమయంలోనూ, అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తన సన్నిహితులు, ఉద్యోగులకు క్రిస్మస్ సందర్భంగా బహుమతులు ఇస్తుంటారని వెల్లడించాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!