

నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే భారీ బజ్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుండగా, ఓవర్సీస్ ప్రీమియర్లు సెప్టెంబర్ 23 నుంచే ప్రారంభం కానున్నాయి. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్‌లో ‘ది ప్యారడైజ్’ సరికొత్త బెంచ్‌మార్క్ సృష్టించింది. సినీమార్క్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీసేల్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే $100,000 మార్క్‌ను దాటినట్లు సమాచారం. దీంతో నార్త్ అమెరికాలో ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న తెలుగు చిత్రంగా నిలిచింది.
ఇక సినిమా పాటలు కూడా సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఏషనాగుల’ పాట ఐదు రోజుల్లోనే 50 మిలియన్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ సాధించి, ఆ స్థాయికి అత్యంత వేగంగా చేరుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. పది రోజుల్లో 76 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఓవర్సీస్ బుకింగ్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!