

సౌదీ అరేబియా, యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హూతీలు సౌదీలోని అభా, జాజన్, నిజ్రన్, ఖామిస్ ముషైత్ నగరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 73 మంది గాయపడ్డారు. పలు ఆర్థిక, ఇంధన మౌలిక సదుపాయాల వద్ద మంటలు చెలరేగాయి. యెమెన్‌లో సౌదీ దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేసినట్లు హూతీలు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హూతీలకు తీవ్ర హెచ్చరిక చేశారు. సౌదీ అరేబియాపై దాడులు కొనసాగితే పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియేతో కూడిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం అమల్లోకి రావచ్చని తెలిపారు. ముగ్గురు సభ్య దేశాల్లో ఏ ఒక్కదానిపై సాయుధ దాడి జరిగినా, దానిని మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో ఒప్పంద నిబంధనలను గౌరవిస్తామని ఆసిఫ్ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!