

జాతీయ గేయం ‘వందేమాతరం’ను పూర్తిగా ఆలపించే అంశంపై కాంగ్రెస్, జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. శ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు పూర్తి వందేమాతరం ఆలపించే వరకు నిల్చొని ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలనే తమ వైఖరికి నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు మద్దతివ్వాలని కోరారు.
కాంగ్రెస్ వైఖరిపై నేషనల్ కాన్ఫరెన్స్ అసహనం వ్యక్తం చేసింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మరో పార్టీపై కాంగ్రెస్ షరతులు విధించే హక్కు లేదని స్పష్టం చేసింది. తమ భావజాలాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. దీనిపై కాంగ్రెస్ నేత కపిల్ సింగ్ స్పందిస్తూ.. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా ఇండియా కూటమిలో భాగస్వాములని, కూటమి నిర్ణయాలను వారు గౌరవించాలని అన్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం మరింత ముదిరింది. మరోవైపు, పూర్తి వందేమాతరం ఆలపించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందంటూ బీజేపీ కూడా ఆ పార్టీపై విమర్శలు చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!