

రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో మహేశ్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్ఎం మురళి నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం మంగళవారం ప్రకటించింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రేమ, వినోదంతో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి భావోద్వేగ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు మహేశ్ చంద్ర తెలిపారు. యువతకు ఉపయోగపడే మంచి సందేశాన్ని కూడా సినిమాలో అందించామని చెప్పారు. బ్రహ్మానందం వాయిస్ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ను రూపొందించామని, వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చామని దర్శకుడు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!