

తెలుగు సోషల్ మీడియా ప్రేక్షకుల్లో ‘నందూస్ వరల్డ్’ ద్వారా రమా నందనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. లండన్‌లో ఉంటూ హోమ్ టూర్స్, వంటలు, లగ్జరీ షాపింగ్, కుటుంబ వేడుకలకు సంబంధించిన వీడియోలను ఆమె పంచుకునేవారు. ఈ క్రమంలో ఆమె వీడియోలకు భారీగా ఆదరణ లభించింది. ఈ ఏడాది విడుదలైన చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోనూ ఆమె చిన్న పాత్రలో కనిపించారు.
అయితే కన్సల్టెన్సీ మోసం కేసులో రమా నందన, ఆమె భర్తపై పలు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. లండన్‌లో ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాలు, వీసాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు, మరికొందరి నుంచి కోటికి పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్‌కు వచ్చిన రమా నందనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకే ఆమె భారత్‌కు వచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!