

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. శ్రీదేవి, బోనీ కపూర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ, హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత ‘దేవర పార్ట్ 1’ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్ సరసన నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆమెకు దక్షిణాదిలో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇక తాజాగా ధ్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కనున్న ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్‌కు కూడా జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. ముఖ్యంగా ‘పెద్ది’ సినిమా భారీ విజయం సాధిస్తే జాన్వీకి తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి మరిన్ని స్టార్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!