

తిరు వీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ‘ఓ..! సుకుమారి’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం, రొమాన్స్, కామెడీ, పల్లెటూరి అందాలతో కూడిన పూర్తి వినోదాన్ని అందించనుంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కథలో దామిని అనే అమ్మాయి ప్రత్యేకమైన సమస్యతో బాధపడుతుంది—ఆమెను తాకిన వారికి కరెంట్ షాక్ తగులుతుంది. ఈ రహస్యాన్ని దాచిపెట్టి ఆమెకు హీరోతో పెళ్లి జరగడం, తర్వాత జరిగే సంఘటనలు వినోదాత్మకంగా, భావోద్వేగాలతో మిళితమై సాగుతాయి. ఈ విభిన్నమైన కాన్సెప్ట్‌ను దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. తిరు వీర్ అమాయక యువకుడిగా సహజంగా నటించగా, ఐశ్వర్య రాజేష్ తన పాత్రలో మెప్పించారు. మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్, ఝాన్సీ, ఆమని తదితరులు సినిమాకు మరింత హాస్యాన్ని జోడించారు. జూలై 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!