
సినిమాలు

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ఆయన సంప్రదింపులు జరిపినట్లు వార్తలు ప్రచారంలోకి రావడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అల్లు అర్జున్ గానీ, ప్రశాంత్ కిశోర్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, భవిష్యత్ రాజకీయ అవకాశాలపై అల్లు అర్జున్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు చర్చలు కొనసాగుతున్నాయని, ఈ నిర్ణయానికి మాతృవంశం వైపు నుంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం అధికారికంగా ధృవీకరించని నివేదికల ఆధారంగానే ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!