
రాజకీయాలు

జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'వదలా' చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ కృష్ణ అకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ బి. కొడకండ్ల సంగీతం అందించగా, హృతిక శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. చరిత చిత్ర బ్యానర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ, కిషోర్ నాయుడు చిరుమామిళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందు చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో జీవితంలో ఎప్పటికీ వదలలేనిది ఏమిటని యాంకర్ ప్రశ్నించగా, జగపతిబాబు వెంటనే "సిగరెట్" అని సమాధానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం 'వదలా' మంచి కంటెంట్ ఉన్న సినిమా అని, సినిమాలను కావాలనే నెగిటివ్ చేయడం సరైన ధోరణి కాదని అన్నారు. అందరూ సానుకూల దృక్పథంతో ఉంటేనే సినిమా పరిశ్రమ మరింత ముందుకు సాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!