
రాజకీయాలు

వన్యప్రాణులకు సంబంధించిన వస్తువుల విషయంలో మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ కీలక ప్రకటన చేశారు. కేరళ అటవీశాఖ అమలు చేస్తున్న క్షమాభిక్ష పథకంలో భాగంగా తన వద్ద 10 ఏనుగు దంతాలు, ఏనుగు దంతాలతో తయారు చేసిన 13 విగ్రహాలు ఉన్నాయని వెల్లడించారు. అవన్నీ తనకు వారసత్వంగా లేదా బహుమతుల రూపంలో వచ్చినవేనని ఆయన స్పష్టం చేశారు.
వన్యప్రాణి సంబంధిత వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై మోహన్‌లాల్ ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ క్షమాభిక్ష పథకాన్ని ఉపయోగించుకుని తన వద్ద ఉన్న వస్తువుల వివరాలను అధికారులకు సమర్పించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!