
జనరల్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన కుమార్తె వివాహానికి సంబంధించిన విలాసవంతమైన ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. రాజసాన్ని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అత్యంత నాణ్యమైన డిజైన్‌తో పాటు సంప్రదాయానికి ప్రాధాన్యం ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వెడ్డింగ్ బాక్స్‌లో పవిత్రతకు ప్రతీకగా వెండి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అతిథులకు పట్టు చీర, ధోతీ వంటి సాంప్రదాయ వస్త్రాలను కూడా అందిస్తున్నారు. ఈ ఆహ్వాన పత్రికను చూసిన సినీ వర్గాలు, అభిమానులు బండ్ల గణేష్ కుమార్తె వివాహం టాలీవుడ్‌లో అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో ఒకటిగా నిలవొచ్చని అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!