
రాజకీయాలు

కృత్రిమ మేధస్సు (ఏఐ) భవిష్యత్తుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ పూర్తిగా మారిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రాబోయే తరాన్ని చరిత్రలోనే అత్యంత అవగాహనలేని తరం అని పేర్కొంటూ ఏఐ ప్రభావం ప్రతి రంగాన్నీ పూర్తిగా మార్చేస్తుందని అన్నారు.
ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతే ప్రజల ఆదాయం తగ్గి, ప్రభుత్వాలకు పన్నులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. బ్యూరోక్రసీ కూడా ఏఐ ఆధారంగా నడిస్తే సివిల్ సర్వీసెస్‌కు ఎవరు సిద్ధమవుతారని, పాలనలో ఏఐ కీలక పాత్ర పోషించే పరిస్థితి వస్తే ప్రజాప్రతినిధుల సంఖ్య పెంపు అవసరమేంటని ప్రశ్నించారు. 2050 ప్రపంచంపై తన అంచనాలను వెల్లడించిన ఆర్జీవీ వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృత చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!