

సినీ నటి జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఏఐ మార్ఫింగ్ వీడియోల వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలు ఎలా రూపొందించబడ్డాయి, ఎక్కడి నుంచి సోషల్ మీడియాలోకి వచ్చాయి, వాటిని ఎవరు ప్రచారం చేశారనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తూ డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు.
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సినీ ప్రముఖులు, ఇతర వ్యక్తులకు సంబంధించిన మార్ఫింగ్ కంటెంట్‌ను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ మార్ఫింగ్ వీడియోలను రూపొందించి, ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఘటనలోనూ వీడియోల వెనుక ఉన్న వ్యక్తులు, అకౌంట్లను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!