
జనరల్

చిరంజీవి ‘పెద్ది’ చిత్ర ఘన విజయంపై రామ్ చరణ్ తో పాటు చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రస్తుతం పొల్లాచిలో చిత్రీకరణలో ఉన్నప్పటికీ తన మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉందని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఈ చిత్రం కోసం రామ్ చరణ్ చేసిన కృషి, అంకితభావం, పట్టుదలను దగ్గర నుంచి చూసానని, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చూస్తుంటే తండ్రిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా గర్వంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు, నటులు శివరాజ్‌కుమార్, జగపతిబాబు, జాన్వీ కపూర్ తో పాటు మొత్తం చిత్ర బృందాన్ని అభినందించారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్, ఛాయాగ్రాహకుడు రత్నవేలు, కళా దర్శకుడు కొల్లా అవినాష్, ఎడిటర్ నవీన్ నూలి సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘పెద్ది’ విజయం తెలుగు సినిమాకు మరింత గౌరవాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!