
జనరల్

అరెస్ట్ అయిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ముందు చేపట్టిన ధర్నాను కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విరమించింది. అరెస్టయిన కార్యకర్తలను విడుదల చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
పోలీసు అధికారులతో జరిగిన చర్చల అనంతరం పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ధర్నాను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల హామీతో నిరసన ప్రాంతంలో ఉద్రిక్తత తగ్గి, కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!