

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, ప్రత్యేక వీడియోలు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
మొదటి పాట ‘తబాహి’ వైరల్ కావడంతో పాటు యశ్, కియారా అద్వానీల రొమాంటిక్ సన్నివేశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా రెండో పాటకు సంబంధించిన బ్లర్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం, ఈరోజు ఉదయం 11:33 గంటలకు సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పాటలో యష్, తారా సుతారియా మధ్య రొమాన్స్ ఉండనున్నట్లు సమాచారం రావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!