
జనరల్

కొండకల్ గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడి ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు చిన్నారుల సౌకర్యార్థం కుర్చీలు అందజేయడంతో పాటు, వారి ఆరోగ్యం దృష్ట్యా డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నందమూరి దీపిక జానకిరామ్ స్వయంగా పాల్గొని చిన్నారులకు అవసరమైన వస్తువులను అందజేశారు. చిన్నారుల విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ట్రస్ట్ పేర్కొంది. పిల్లల భవిష్యత్తు బలోపేతానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, సమాజాభివృద్ధికి సేవే తమ ప్రధాన లక్ష్యమని ట్రస్ట్ వెల్లడించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!