
జనరల్

ఢిల్లీలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య అరెస్టయిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలను మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రియాంక గాంధీతో పాటు ఇతర నేతలను కలిసి పరామర్శించారు. దీంతో అక్కడ రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి.
మరోవైపు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. పరిస్థితి అదుపులో ఉండేందుకు పోలీసులు స్టేషన్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!