
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో జరిగిన నిరసన సందర్భంగా అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు నిరసనకారులందరినీ ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియం పోలీస్ స్టేషన్ నుంచి, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు.
అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ ఆరోపించింది. బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో రాహుల్ గాంధీకి స్వల్ప గాయాలయ్యాయని, ముక్కు నుంచి రక్తస్రావం కూడా జరిగినట్లు పార్టీ పేర్కొంది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుండగా, పోలీసుల తీరుపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!