
జనరల్

మైలవరం పరిధిలోని జి. కొండూరు పోలీస్ స్టేషన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో వీడియో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన రమావత్ వెంకటేశ్వరరావు సీఎంను దూషిస్తూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని, అందులో ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు కూడా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.
గ్రామానికి చెందిన బాణావత్ బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. విచారణలో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!