
సినిమాలు

తెలుగు సినిమా చరిత్రలో గేమ్ చేంజర్‌గా నిలిచిన చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటి అని చెప్పాలి. ప్రభాస్, రాజమౌళి వంటి వారితో పాటు తమన్నా వంటి నటీమణులకు ఇది గొప్ప గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమాలో అవంతిక పాత్రలో తమన్నా చేసిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె ‘బాహుబలి’ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రాంతీయ చిత్రంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అప్పట్లో పెద్ద రిస్క్‌గా అనిపించినప్పటికీ, రాజమౌళి దూరదృష్టి మరియు అంకితభావమే సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయని ఆమె అన్నారు. ‘బాహుబలి’ రెండు భాగాలు భారీ వసూళ్లు సాధించి పాన్ ఇండియా సినిమాల ట్రెండ్‌కు దారితీశాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్నా తమిళంలో ‘మకుటం’ చిత్రంలో విశాల్‌కు జంటగా నటిస్తూ, హిందీ సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!