
జనరల్

సూపర్‌స్టార్ మహేష్ బాబు తొలి చిత్రం రాజకుమారుడు ప్రచారాన్ని తన స్వగ్రామమైన బుర్రిపాలెం నుంచి ప్రారంభించి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అదే సెంటిమెంట్‌ను ఇప్పుడు నటుడు జయకృష్ణ కొనసాగిస్తున్నారు. తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ప్రచార కార్యక్రమాలను కూడా బుర్రిపాలెం నుంచే ప్రారంభించాలని చిత్రబృందం నిర్ణయించింది.
ఇంకా విశేషం ఏమిటంటే, శ్రీనివాస మంగాపురం చిత్రం కూడా రాజకుమారుడు విడుదలైన తేదీ అయిన జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సెంటిమెంట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచగా, జయకృష్ణ కెరీర్‌కు ఇది శుభారంభం కావాలని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!