
జనరల్

నటుడు ప్రకాశ్ రాజ్ తనపై వస్తున్న విమర్శలు, దుష్ప్రచారాలపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తాను మౌనంగా లేనని, జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తున్నానని పేర్కొన్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి ప్రభావంతో పనిచేస్తున్న కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా వేదికలు తనపై అబద్ధపు కథనాలు, అసత్య ప్రచారం, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా అలాంటి వారిని ఉద్దేశించి "దిగజారండి... దిగజారుతూనే ఉండండి" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మొత్తం వారి వ్యవహారాన్ని గమనిస్తోందని పేర్కొంటూ, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కథలు అల్లినా తనలాంటి ప్రశ్నించే గొంతును ఎవరూ మూయించలేరని స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!