

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. జూలై 23న టెహ్రాన్‌లో మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను మొజ్తబా నిర్వహించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో దేశంలోని కీలక రాజకీయ, మత నాయకులు పాల్గొనే అవకాశముందని అధికారులు తెలిపారు.
సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొజ్తబా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. భద్రతా కారణాల వల్ల తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదని సమాచారం. ఇటీవల తన సతీమణి అంత్యక్రియలకు కూడా ఆయన హాజరుకాలేదు. గత దాడిలో గాయపడిన ఆయన చికిత్స పొందుతున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆ దాడిలో తన కుమార్తెలలో ఒకరు మరణించినట్లు సమాచారం. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌పై జరిగిన దాడులను ఖండిస్తూ, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!