

దక్షిణాది సినీ మరియు రాజకీయ వర్గాల్లో ఒక స్టార్ హీరో, ప్రముఖ హీరోయిన్ గురించి వస్తున్న ప్రచారం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఆ స్టార్ హీరో భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఆమె సమర్పించిన అఫిడవిట్లో తన భర్త ఒక హీరోయిన్‌తో ఉన్న సంబంధం కారణంగానే విడిపోవాల్సి వస్తోందని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇద్దరి గురించి పలు వార్తలు వినిపించినప్పటికీ వారు ఎప్పుడూ దీనిపై స్పందించలేదు.
ఇటీవల ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో మరింతగా వైరల్ అవుతోంది. కొంతమంది వారి పేర్లు ప్రస్తావించకుండా ఆ హీరోయిన్ గర్భవతి అయ్యిందని, ఆ హీరో తండ్రి కాబోతున్నాడని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వార్తలకు అధికారిక ధృవీకరణ లేదు. ఇదే అంశం రాజకీయంగా కూడా చర్చకు దారి తీస్తూ ప్రత్యర్థి వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంలో ఉన్న స్టార్ హీరో, హీరోయిన్ ఎవరు అనే విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టంగా బయటకు రాలేదు. దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించకపోవడంతో అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!