

రామాయణ చిత్రంలో సీత పాత్రలో సాయిపల్లవి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారీ తారాగణం ఉన్నప్పటికీ తన పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ప్రశాంతమైన హావభావాలతో సీత పాత్రకు సహజత్వం తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమె తదుపరి చిత్రం ఓం గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా నవంబర్ 20న థియేటర్లలోకి రానుంది.
తాజా సమాచారం ప్రకారం ఓం చిత్రాన్ని ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందులో సాయిపల్లవి శక్తివంతమైన పోలీసు అధికారిణి పాత్రలో కనిపించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాపై పోరాటం చేసే పాత్రలో ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఆమె పాత్ర పరిచయ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రామాయణతో వస్తున్న గుర్తింపు, నటనకు ఉన్న ఆదరణతో భారీ చిత్రాల నిర్మాతలు సాయిపల్లవిని తమ ప్రాజెక్టుల్లోకి తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!