

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ప్రకటించిన గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టు భవిష్యత్తుపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రకటించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఖరారయ్యారు. భారీ పాన్ ఇండియా పౌరాణిక చిత్రంగా రూపొందించాలనేది ప్రణాళిక. అయితే నిర్మాతలతో త్రివిక్రమ్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం నేపథ్యంలో సినిమా ఆగిపోయే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆదర్శ కుటుంబం విడుదల వాయిదాలు, ఆర్థిక ఒప్పందాల విషయంలో విభేదాలు వచ్చినట్లు సమాచారం. విడుదలైన తర్వాత సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయట. సుమారు 125 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యానికి తొలి వారంలో 65 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మరో నిర్మాతతో సినిమా చేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. గాడ్ ఆఫ్ వార్ కోసం 400-500 కోట్ల భారీ బడ్జెట్ అవసరమవుతుందని అంచనా. ఓటీటీ మార్కెట్ మందగించిన సమయంలో ఇంత పెట్టుబడి పెట్టడం పెద్ద రిస్క్‌గా మారింది. అయితే ఈ ప్రాజెక్టు నిలిచిపోతుందని ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!