
జనరల్

ధనుష్, మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓం’. సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘షేర్ ఆఫ్ అరేబియా..’ అంటూ సాగే పాటను విడుదల చేసింది. మమ్ముట్టి, ధనుష్ స్టైలిష్ లుక్స్, స్వాగ్‌తో కూడిన సన్నివేశాలతో ఈ పాట ఆకట్టుకుంటోంది. సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చగా, తమిళ్ అధవన్‌తో కలిసి ఆయనే ఈ పాటను ఆలపించారు. ఇప్పటికే విడుదలైన ఈ గీతం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!