

సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. ఒక సినిమా విజయం సాధిస్తే అవకాశాలు వెల్లువెత్తుతాయి. వరుస పరాజయాలు ఎదురైతే కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. తెలుగులో ఆమె నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోకపోయినా, ఇతర భాషల్లో వరుసగా భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో శ్రీలీల కెరీర్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
శ్రీలీల ఇప్పటికే శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘పరాశక్తి’తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ధనుష్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఓం’ చిత్రంలోనూ రోజా అనే పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’తో పాటు అజిత్ కుమార్ నటించనున్న ‘డేర్‌డెవిల్’ ప్రాజెక్టుల్లోనూ ఆమెకు అవకాశాలు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, శ్రీలీల తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకోనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిర్మాతలకు అందుబాటులో ఉండేలా పారితోషికం విషయంలో సర్దుబాటు చేసుకోవాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ ప్రచారంపై శ్రీలీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!