

ప్రభాస్ నటిస్తున్న ఫౌజి సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. టీజర్‌లో కనిపించిన హిట్లర్-బోస్ సన్నివేశం అసలు సినిమాలో ఉండదని తెలుస్తోంది. కేవలం ప్రచార చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా ఆ సన్నివేశాన్ని రూపొందించినట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలియక కొందరు ప్రేక్షకులు సినిమా కథపై రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా ఆ సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని జరుగుతున్న ట్రోలింగ్ చిత్రంపై ప్రతికూల ప్రచారానికి దారితీస్తోంది. దీంతో ప్రభాస్ కూడా ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీజర్ కారణంగా సినిమాకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకుడికి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడిని ప్రభాస్ మందలించారనే ప్రచారం మొదలైంది. అయితే ఈ వ్యవహారంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!