

‘ఇరుముడి’ చిత్రంతో గ్లామర్‌తో పాటు సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ప్రియా భవానీ శంకర్ ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘డిమోంటీ కాలనీ 3’ విడుదల తేదీపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. నటుడు అరుళ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘ది ఎండ్ ఈజ్ టూ ఫార్’ అనే ఉపశీర్షికను ఖరారు చేశారు. దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
‘నరకానికి కౌంట్‌డౌన్ మొదలైంది.. మీ కోసం ఈ సంక్రాంతికి ఓ పీడకల ఎదురుచూస్తోంది’ అంటూ చిత్రబృందం ఎక్స్‌లో పోస్టర్‌ను విడుదల చేసింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముత్తు కుమార్, మీనాక్షి, అర్చన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘డిమోంటీ కాలనీ’ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న ఈ హారర్ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో మూడో భాగంపై అంచనాలు పెరిగాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!