

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ భవిష్యత్తుపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రచారం ఉంది. అయితే ప్రస్తుత ఓటీటీ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే వార్తలు ఈ ప్రాజెక్ట్ వాణిజ్యపరమైన అవకాశాలపై సందేహాలు కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంత భారీ బడ్జెట్‌ను భరించే విషయంలో నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కుమారస్వామి కాన్సెప్ట్ ఆధారంగా ఇతర సినిమాలు కూడా రూపొందుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో, ప్రాజెక్ట్ ఆలస్యమైతే కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే త్రివిక్రమ్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!