

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. రవితేజ నటించిన ‘ఇరుముడి’ విజయంతో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమవుతుందని కూడా సినీ వర్గాల్లో చర్చ జరిగింది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. రవితేజ–హసిత్ గోలి చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. సినిమా కేవలం వాయిదా పడుతుందా? లేక ప్రాజెక్ట్‌పై నిర్ణయంలో మార్పు వచ్చిందా? అనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘ఇరుముడి’ తర్వాత రవితేజ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!