

ప్రభాస్ కంటే తాను ఎక్కువ సినిమాలు చేశానని, తనకంటే ఎక్కువ సక్సెస్‌ఫుల్ అని దీపికా పదుకొనే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉన్న ప్రభాస్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు పలువురికి నచ్చలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీపికపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ కూడా పెరిగింది. గతంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, పాత వీడియోలను నెటిజన్లు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. అయితే అసలు వివాదాన్ని పక్కన పెడితే, తాను అంతటి పెద్ద స్టార్ అని భావిస్తున్నప్పుడు తన మార్కెట్ సామర్థ్యాన్ని ప్రత్యేకంగా నిరూపించుకోవాలని కొందరు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ప్రభాస్ వంటి హీరోలతో కలిసి సినిమాలు చేయడం కంటే, పూర్తిగా తనే కథను నడిపించే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో బాక్సాఫీస్ స్టామినా చూపించాలని నెటిజన్లు అంటున్నారు. దీపిక నటించిన ‘చప్పక్’ 2020లో విడుదలై సుమారు రూ.50 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు సాధించింది. అయితే అది ప్రయోగాత్మక చిత్రం కావడంతో ప్రస్తుత మార్కెట్‌తో పోల్చడం సరికాదనే వాదన కూడా ఉంది. ఇప్పుడు యాక్షన్ అంశాలతో కూడిన భారీ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి వందల కోట్ల వసూళ్లు సాధిస్తే తన మార్కెట్ స్థాయి మరింత స్పష్టమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!