

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఏథర్ కొత్త స్కూటర్ ‘కోణార్క్’ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. S, Z అనే రెండు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1 లక్షగా ఉంది. S వేరియంట్‌లో 2.1kWh, 2.7kWh, 3.5kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండగా, ఇవి వరుసగా 100 కి.మీ., 125 కి.మీ., 161 కి.మీ. వరకు ఐడిసి రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. గరిష్ఠ వేగం గంటకు 70 కి.మీ.గా ఉంది.
కోణార్క్‌లో 31 లీటర్ల స్టోరేజ్, యూఎస్‌బీ టైప్-C పోర్ట్, అండర్-సీట్ ల్యాంప్, 4.2 అంగుళాలు, 7 అంగుళాల డిస్‌ప్లేలు, పార్క్ అసిస్ట్, రివర్స్, ఆటో హోల్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Z వేరియంట్‌లో ఏఈబిఎస్, మ్యాజిక్ కీ, యాప్ ఆధారిత లాక్, అన్‌లాక్, గూగుల్ మ్యాప్స్, వాట్సాప్, థెఫ్ట్ అలర్ట్, రైడ్ స్టాటిస్టిక్స్, ఫైండ్ మై స్కూటర్, ఛార్జింగ్ మానిటరింగ్, ఓటీఏ అప్‌డేట్స్ వంటి అదనపు సదుపాయాలు లభిస్తాయి. భవిష్యత్తులో 200 కి.మీ. రేంజ్ అందించే మరో వేరియంట్‌ను కూడా తీసుకురానున్నట్లు ఏథర్ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!