

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే హెచ్-1బీ వీసా ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రూపొందించిన ఈ ప్రతిపాదనకు వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (ఓఐఆర్‌ఏ) సమీక్ష పూర్తైంది. ఆగస్టు 27న సమీక్ష ముగిసినప్పటికీ, నిబంధన ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం హెచ్-1బీ ఉద్యోగులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ కొనసాగుతోంది.
ప్రస్తుత నిబంధన ప్రకారం ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ ఉద్యోగులు కొత్త ఉద్యోగం, స్పాన్సర్‌ను వెతుక్కోవడానికి లేదా తమ ఇమ్మిగ్రేషన్ స్థితిని మార్చుకునేందుకు కొంత సమయం పొందుతున్నారు. ఈ వెసులుబాటు తొలగితే ఉద్యోగం కోల్పోయిన వెంటనే కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సిన ఒత్తిడి పెరగవచ్చు. అమెరికా హెచ్-1బీ కార్యక్రమంలో భారతీయ నిపుణుల వాటా అధికంగా ఉండటంతో ఈ ప్రతిపాదనపై భారతీయ ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తుది నిబంధనలు, అమలు తేదీ అధికారికంగా వెలువడిన తర్వాతే పూర్తి ప్రభావం స్పష్టమవుతుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!