
జనరల్

హైదరాబాద్ నగర ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాత్రి 11, 12 గంటల వరకు నడుస్తున్న సిటీ బస్సులను సెప్టెంబర్ 1 నుంచి రాత్రి వేళల్లోనూ అందుబాటులోకి తీసుకురానుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బస్సులను నడపాలని నిర్ణయించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఆరు ప్రధాన మార్గాల్లో ఈ సేవలను ప్రారంభించనుంది.
సికింద్రాబాద్–కొండాపూర్, బాచుపల్లి–వేవ్‌రాక్, సికింద్రాబాద్–హయత్‌నగర్, కోఠి–పటాన్‌చెరు, కోఠి–హైటెక్ సిటీ, సికింద్రాబాద్–పటాన్‌చెరు మార్గాల్లో రాత్రి సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలతో రాత్రివేళ ప్రయాణించే వారికి ఇబ్బందులు తగ్గనున్నాయి. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని మరిన్ని మార్గాలకు రాత్రి బస్సు సేవలను విస్తరించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!