
గాసిప్స్

రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై బల్విందర్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు డ్రోన్ల ద్వారా సిమ్ కార్డులు, ఇతర సామగ్రిని చేరవేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. భారత మొబైల్ నంబర్లతో పాకిస్థాన్‌లో వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు సిమ్‌లను వినియోగించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
దర్యాప్తులో సరిహద్దు ప్రాంతాల్లో సోలార్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నినట్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నిందితుడికి మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. పాక్ హ్యాండ్లర్లతో అతడికి ఉన్న సంబంధాలు, సరిహద్దు కార్యకలాపాల్లో అతని పాత్రపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!