

తెలంగాణను ప్రపంచస్థాయి గోల్ఫ్ టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. షామీర్‌పేట సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే కృష్ణా నది తీరంలోని సోమశిలలో మరో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సును అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ సందర్భంగా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గోల్ఫ్ టూరిజం మౌలిక వసతుల అభివృద్ధికి పీపీపీ విధానాన్ని అనుసరిస్తామని, రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, అడవులు, సరస్సులు, నదులను పర్యాటకంతో అనుసంధానిస్తామని తెలిపారు. పర్యాటకం, క్రీడల ప్రచారం కోసం దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!