

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై పాలిటెక్నిక్ విద్యార్థుల్లో అనేక అపోహలు, ఆందోళనలు నెలకొన్నాయని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పాలిటెక్నిక్ విద్యను ఇంజినీరింగ్ పరిధిలోనే కొనసాగించాలని, దానిని కార్మిక శాఖకు బదిలీ చేయొద్దని కోరారు. నైపుణ్య ఆధారిత విద్య ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దేశంలో అమలవుతున్న విధానాన్నే తెలంగాణలోనూ కొనసాగించాలని ఆయన సూచించారు.
‘శక్తి’ పథకం పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, జీవో 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు కూడా విద్యార్థులకు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాజీ ఎంపీ కే. కేశవరావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!