

ధురంధర్ 2తో బాలీవుడ్ వసూళ్లకు భారీ ఊపు వచ్చినట్లు కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1800 కోట్ల వసూళ్లు సాధించడంతో పరిశ్రమలో ఉత్సాహం పెరిగింది. అయితే అదే సమయంలో అమీర్ ఖాన్ నిర్మాణంలో సన్ని దేవోల్ హీరోగా నటించిన బట్వారా 1947 భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచింది. దీంతో బాలీవుడ్‌కు వచ్చిన ఊపు ఎంతకాలం కొనసాగుతుందన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే అదే రోజు విడుదలైన ఆవారాపన్ 2 ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. బోర్డర్ 2, ధమాల్ 4, భూత్ బంగ్లా, వెల్కమ్ టూ ది జంగిల్ వంటి సీక్వెల్స్ కూడా మంచి ఫలితాలను అందుకున్నాయి. మరోవైపు అక్షయ్, సైఫ్ నటించిన హైవాన్ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా విజయాలు, పరాజయాలతో బాలీవుడ్ ప్రయాణం సాగుతోంది.
ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్ అంశ్, మీర్జాపూర్, ఆవారాపన్ 2 చిత్రాలు కూడా సంచలన విజయాలు సాధించాయి. 2026లో ధురంధర్ 2 తర్వాత హనుమాన్ అంశ్ 2 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కి 300 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు సమాచారం. వెబ్ సిరీస్‌గా విజయవంతమైన మీర్జాపూర్ కూడా సినిమాగా వచ్చి దాదాపు 300 కోట్ల గ్రాస్ రాబట్టింది. తాజాగా దృశ్యం 3 కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల పైగా గ్రాస్ నమోదైనట్లు వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!