

హీరో నితిన్ తన సినిమాల ఎంపికలో మార్పులు చేస్తూ మంచి కథలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం కమర్షియల్ అంశాలకే పరిమితం కాకుండా, బలమైన కథాంశం, వినోదం కలగలిసిన చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
‘సామజవరగమన’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రామ్ అబ్బరాజు ప్రస్తుతం ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమాతో బిజీగా ఉన్నారు. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పనులు పూర్తయిన తర్వాత నితిన్ ప్రాజెక్ట్‌పై ఆయన దృష్టి సారించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ అబ్బరాజు గత చిత్రాల శైలిని బట్టి చూస్తే, నితిన్‌తో మరో వినోదాత్మక చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!