

భారతీయ సూపర్ హీరో చిత్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘క్రిష్’ ఫ్రాంచైజీకి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో నాలుగో భాగమైన ‘క్రిష్ 4’కు హృతిక్ రోషన్ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తండ్రి రాకేష్ రోషన్ నుంచి బాధ్యతలు తీసుకోనున్నారట. అదే సమయంలో మరోసారి క్రిష్ పాత్రలో హృతిక్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో ‘రామాయణ’ నిర్మాత నమిత్ మల్హోత్రా భాగస్వామి అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.
ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను ఆస్కార్ విజేత సంస్థ డీఎన్ఈజీ చేపట్టేలా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.700 నుంచి రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని రూపొందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కథలో సమాంతర విశ్వాలు, కాల ప్రయాణం వంటి ఆసక్తికరమైన అంశాలకు చోటు కల్పించనున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం భారతీయ సూపర్ హీరో సినిమాల రూపురేఖలను మార్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!