

ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ‘కల్కీ 2’లో నటించబోయే నటి పేరుగా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా పేరు బలంగా వినిపిస్తోంది. ‘కల్కీ’ ఫ్రాంచైజీని పాన్ ఇండియా స్థాయి నుంచి నేరుగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో ప్రియాంక చోప్రా జోడీగా వస్తే హాలీవుడ్, యూరప్, ఆసియా మార్కెట్లలో భారీ ఓపెనింగ్స్ మరియు బజ్ వచ్చే అవకాశం ఉందని టీమ్‌లో మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. మొదటి భాగంలో దీపిక పాత్ర కథకు కీలకంగా ఉండగా, ఆమె గర్భిణీగా కనిపించే సన్నివేశాలు, భావోద్వేగ గాఢత ప్రేక్షకులను బలంగా ఆకట్టుకున్నాయి. అందువల్ల సీక్వెల్లో ఆమె లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటీవల తన ఇంటర్వ్యూలో రోజుకు ఎనిమిది గంటలే పని చేస్తానని చెప్పడం, అదే కారణంగా ‘స్పిరిట్’ నుంచి కూడా తప్పుకున్నట్లు వచ్చిన వార్తలు ఈ నిర్ణయానికి కారణమై ఉండవచ్చని చర్చ కొనసాగుతోంది.
దీపిక తప్పుకున్న వెంటనే అనుష్క శెట్టి, సాయి పల్లవి, శ్రుతి హాసన్ పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, ఇప్పుడు ప్రియాంక చోప్రా పేరు టాప్ లిస్ట్‌లో నిలిచింది. దీంతో చివరికి కల్కీ ఫ్రాంచైజీలో ప్రభాస్‌తో జతగా కనిపించేది ప్రియాంక చోప్రానేనా, లేక మరేదైనా హీరోయిన్ను ఎంపిక చేస్తారా అన్నది అధికారిక ప్రకటన వచ్చేదాకా తెలియదు. అభిమానులు మరియు సినీ వర్గాలు ఈ నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!