

రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన రెండో గర్భధారణ సమయంలో ఎదుర్కొన్న శారీరక, మానసిక ఇబ్బందుల గురించి తాజాగా మనసు విప్పి మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కవల పిల్లలకు జన్మనిచ్చే ప్రయాణం తన మొదటి గర్భధారణతో పోలిస్తే ఎంతో కష్టంగా సాగిందని వెల్లడించారు. ఈ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఊహించని విధంగా భావోద్వేగపరమైన ఒత్తిడికి గురయ్యానని ఆమె తెలిపారు. ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు పలువురిని భావోద్వేగానికి గురిచేశాయి.
ప్రసవం తర్వాత తాను తీవ్రమైన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు గురయ్యానని, ఆ మానసిక వేదన నుంచి ఇంకా కోలుకుంటున్నానని ఉపాసన వెల్లడించారు. గర్భధారణ అంటే కేవలం తొమ్మిది నెలల ప్రయాణం మాత్రమే కాదని, బిడ్డకు జన్మనివ్వడానికి ముందే కాకుండా ప్రసవం తర్వాత కూడా మహిళలు ఎన్నో మానసిక, భావోద్వేగపరమైన సవాళ్లను ఎదుర్కొంటారని ఆమె వివరించారు. కొత్తగా తల్లులైన మహిళలకు కుటుంబ సభ్యులు అండగా నిలవాలని, వారికి అవసరమైన ప్రేమ, ఆదరణ, మానసిక మద్దతు అందించాలని సూచించారు. అలాగే, ప్రసవానంతర డిప్రెషన్ లేదా ఇతర మానసిక ఇబ్బందులు ఎదురైనప్పుడు మౌనంగా బాధపడకుండా వైద్యుల సహాయం తీసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!