
సినిమాలు

చైనా పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. షెన్‌జెన్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లి ట్రంప్‌కు స్వాగతం పలికిన జిన్‌పింగ్.. రెడ్ కార్పెట్‌తో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ఆర్థిక సహకారం నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
33వ ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ చైనాకు చేరుకున్నారు. నవంబర్ 18, 19 తేదీల్లో షెన్‌జెన్‌లో ఈ సదస్సు జరగనుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, ప్రాంతీయ అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!