
సినిమాలు

హైదరాబాద్‌లో స్నాప్‌చాట్ వేదికగా సాగుతున్న డ్రగ్స్ సరఫరా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. ఓజీ కుష్, గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.240 కిలోల గంజాయి, 16.59 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని ల్యాంకో హిల్స్ నుంచి కారులో డ్రగ్స్ తరలిస్తుండగా నిందితులను పట్టుకున్నట్లు సమాచారం.
నిందితులు 'OGdude420', 'Dude OG 420' పేర్లతో స్నాప్‌చాట్ ఖాతాలను నిర్వహిస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా సుమారు 800 నుంచి 900 మంది కస్టమర్లకు మత్తు పదార్థాలు అందిస్తున్నట్లు వెల్లడైంది. సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుని సాగిస్తున్న ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!